www.online-parttime-jobs

Search This Blog

Showing posts with label kitchen. Show all posts
Showing posts with label kitchen. Show all posts

Monday, 21 January 2013

బూందీ లడ్డూ

బూందీ లడ్డూ

కావలసిన పదార్ధాలు -
శనగపిండి - ఒకకప్పు
పంచదార - 1 కప్పు
నూనె - తగినంత
ఏలకుల పొడి - కొంచెం
జీడిపప్పు - కొన్ని పలుకులు
తయారుచేయు విధానం -ఒక గిన్నెలో పంచదార తీసుకుని,కొంచెం నీళ్ళు పొసి పాకం పట్టాలి.పాకాన్ని తాకి చూసినపుడు జారిపోకుండా దగ్గరగా రావాలి.అంటే జిగురు పాకం రావాలి.ఒక గిన్నెలో శనఫపిండి తిసుకుని,దానిలో నీళ్ళు పోసి,దోసె పిండిలాగా కలుపుకోవాలి.బాణలిలో నూనె వెడి చేసి,దానిలో కలుపుకున్న శనగపిండిని బూంది గరిటలో వేసి,నూనెలో పడే విధంగా నెమ్మదిగా చెత్తో రుద్దాలి.బూందీ కాగిన తర్వాత తీసి,పాకంలో వేసుకొవాలి.దానిలో ఏలకులపొడి,జిడిపప్పు వేసి కావలసిన సైజులో లడ్డూలూ చుట్టుకోవాలి.

వాంపూస

వాంపూస

కావలసిన పదార్ధాలు -
శనగపిండి - రెండుకిలోలు
వరిపిండి - 100 గ్రాములు
అల్లం వెల్లుల్లి పెస్ట్ - 100 గ్రాములు
పచ్చిమిర్చి ముద్ద - 100 గ్రాములు
వాము - 50 గ్రాములు
ఉప్పు - తగినంత
నీళ్ళు - తగినన్ని

తయారుచేయు విధానం -ముందుగా శనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేసుకొవాలి.తరువాత అల్లం వెల్లుల్లిముద్ద,పచ్చిమిర్చి రసం ఒక గ్లాసుడు తీసుకుని వడపొసుకొవాలి.ఒక గిన్నె తిసుకుని దానిలో మెత్తగా చేసుకున్న శనగపిండి,వరిపిండి,అల్లం పచ్చిమిర్చి రసం,తగినంత ఉప్పు,వాము తగినన్ని నీళ్ళు పొసి పిండిని గట్టిగా కలుపుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి చిన్న రంధ్రం ఉన్న బిళ్ళను జంతికల గొట్టంలో ఉంచి నూనెలో నొక్కాలి.

మురీకిలు

మురీకిలు

కావలసిన పదార్ధాలు -
వరిపిండి - మూడు కిలోలు
శనగపిండి - 50 గ్రాములు
నువ్వులు - 50 గ్రాములు
జీలకర్ర - 25 గ్రాములు
నూనె - మూడున్నర కిలోలు
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా వరిపిండి,శనగపిండి,జీలకర్ర,నువ్వులు తగినంత ఉప్పు,25 గ్రాముల నూనె వేసి కలుపుకుని పక్కన పెట్టుకొవాలి.పిండిని గట్టిగా మరిగించిన నీళ్ళు వేసి కలుపుకొవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి స్టార్ గుర్తు ఉన్న బిళ్ళని జంతికల గొట్టంలో పెట్టి నొక్కాలి.ఈ మురుకులు ఎరుపు రంగు వచ్చాక తీసేయాలి.

జంతికలు

జంతికలు

కావలసిన పదార్ధాలు -
వరిపిండి - 5 కిలోలు
శనగపిండి - అరకిలో
వాము - 100 గ్రాములు
కారం - 100 గ్రాములు
నూనె - నాలుగున్నర కిలోలు
ఉప్పు - తగినంత
నీళ్ళు - తగినన్ని
తయారుచేయు విధానం -ముందుగా నిటిని మరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.తరువాత శనగపిండి,వరిపిండి,వాము,కారం,ఉప్పు,400 గ్రాముల నూనె వేసి బాగా కలపుకోవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకుడు పెట్టి ఈ ఫీండిని బెజ్జాల గరిటెలో పెట్టి జంతికలు వేసుకొవాలి.

చెక్కలు

చెక్కలు

కావలసిన పదార్ధాలు -
వరిపిండి - మూడున్నర కిలోలు
మైదాపిండి - అరకిలో
పెసరపప్పు - 100 గ్రాములు
జీలకర్ర - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
నూనె - నాలుగు కిలోలు
పచ్చిమిర్చి - కిలోన్నర
నీళ్ళు - తగినన్ని
తయారుచేయు విధానం -ముందుగా పచ్చిమిరపకాయలను ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకొవాలి.తరువాత నీళ్ళు మరిగించి ముందుగా తీసుకున్న వరిపిండి,మైదాపిండి,పేసరపప్పు,జీలకర్ర, తగినంత ఉప్పు,పచ్చిమిర్చి ముద్ద వేసి ఉక్కబెట్టుకొవాలి.ఇలా ఉక్కబెట్టుకున్న పిండిని చిన్న చిన్న గొళిలుగా చేసుకొవాలి.వాటిని పలుచగా గుండ్రంగా ఒత్తుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి వెడల్పాటి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి ముందుగా ఒత్తుకున్న చెక్కలను ఇందులో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి.అంతే చక్కినాలు రడీ.
Page 1

బొబ్బట్లు

బొబ్బట్లు

కావలసిన పదార్ధాలు -
శేనగపప్పు - పావుకిలో
బెల్లం - పావుకిలో
పచ్చికొబ్బరి - అరకప్పు
నెయ్యి - పావుకిలో
మైదాపిండి - 200 గ్రాములు
యాలకులు -10
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా మైదాపిండిని కొద్దిగా నీళ్ళతో కలుపుకుని నూనెలో నానబెట్టాలి.ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో ఉడకబెట్టాలి.బాగా మెత్తగా ఉడికాక అందులో బెల్లం,యాలకులపొడి,పచ్చి కొబ్బరి తురుము,వేసి ఉడకనిచ్చి దించేయాలి.చల్లారిన తర్వాత దిన్ని మెత్తగా రుబ్బుకోవాలి.ఇలా రుబ్బిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి.ఇప్పు డు మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని ఒక అరిటాకుపై నెయ్యిరాసి దానిపై ఈ ఉండని వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో పూర్ణం ఉండ పెట్టి నాలుగువైపూలా మూసేసి చెత్తో చపాతిలా మెల్లగా ఒత్తుకోవాలి.ఇప్పుడు పెనంపై నెయ్యి వేసి దానిపై ఒత్తుకున్న బొబ్బట్టుని వేసి రెండుపైపులా దొరగా వేయించుకోవాలి.అంతే నొరూరించే బొబ్బట్లు రడీ.

అరిసెలు

అరిసెలు

కావలసిన పదార్ధాలు -
బియ్యం - ఒక కిలో
బెల్లం - అరకిలో
నువ్వులు - 50 గ్రాములు
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి.నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి.పిండిని జల్లించి పెట్టుకొవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం కొద్దిగా నీళ్ళు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి.అందులో ఈ పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని అరిటాకుపై ఒత్తుకుని కాగిన నూనెలో వేయాలి.రెండుపైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి.ఎరుపు రంగు వచ్చాక ఒక ప్లేటులో నువ్వులు వేసి దానిలో ఈ అరిసెలు ఒత్తాలి. అంతే అరిసెలు రడీ.

ఊతప్పం

ఊతప్పం

కావలసిన పదార్ధాలు -
పంచమిశ్రమం పిండి - రెండు కప్పులు
క్యారెట్ తురుము - అరకప్పు
ఉల్లితురుము - అరకప్పు
టమోటొ ముక్కలు - పావుకప్పు
అల్లం ముక్కలు - ఒక స్పూన్
పాలు - పావు లీటరు
కొబ్బరి తురుము - అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా పంచమిశ్రమం పిండిని ఒక గిన్నెలో తిసుకుని తగినన్ని పాలు పోసి దొసెల పిండిలా కలుపుకోవాలి.ఇందులో ఉల్లి తురుము,టమోటా తురుము,క్యారెట్ తురుము,అల్లం ముక్కలు,కొబ్బరి తురుము,పచ్చిమిర్చి,జీలకర్ర,ఉప్పు వేసి బాగా కలపాలి.పిండి మరీ గట్టిగా అయితె మరిన్ని పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక స్పూన్ వెన్న రాసి బాగా వెడేక్కాక రెండు గరిటెల పంచమిశ్రమం పిండి వెయ్యాలి.మళ్ళి ఒక స్పూన్ నూనె వెయ్యాలి.ఊతప్పం రెండు వైపూల కాలాక తీసేయాలి.దినిని పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

పాలక్ పరోటా

పాలక్ పరోటా

కావలసిన పదార్ధాలు -
గోధుమపిండి - నాలుగు కప్పులు
సోయాపిండి - పావుకప్పు
పాలకూర - రెండు కట్టలు
పచ్చిమిరపకాయలు - 5
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్
నిమ్మరసం - ఒకటీ స్పూన్
ధనియాలపొడి - అరటీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.ఇప్పుడు గోధుమ పిండి,సోయాపిండి,తరిగిన పాలకూర,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి ముద్ద,నిమ్మరసం,ధనియాలపొడి,గరం మాసాలా ఉప్పు అన్నింటిని వేసి చపాతి పిండిలా కలిపి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి.ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసి పరోటా మాదిరి ఒత్తుకుని పెనంపై కాల్చాలి.రెండు వైపూలా సొయానూనె చెంచా చొప్పున వేస్తే చాలు.వేడి వేడి సొయా పాలక్ పరోటా రడీ.

ఆలూ బాల్స్

ఆలూ బాల్స్

కావలసిన పదార్ధాలు -
బంగాళదుంపలు - 4
పాలు - అరకప్పు
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ - అరకప్పు
బ్రెడ్ స్లయిస్ - 1
ఉప్పు,మిరియాల పొడి రుచికి తగినంత.
తయారుచేయు విధానం -ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి,తొక్కలు తీసి ఉండల్లేకుండా చూసుకోవాలి.అందులో పాలు,వెన్న,బ్రెడ్ ముక్క,రవ్వ,ఉప్పు,మిరియాల పొడి వేసి మెత్తగా కలిపి ఉండలు చేసుకోవాలి.ఒక పెద్ద పాత్రను తీసుకుని దానిలో సగం దాకా నీరు పోసి కొంచెం ఉప్పు వేసి మరగనిచ్చి ఆలూ మిశ్రమ ఉండల్ని వేయాలి.ఉడికితే ఉండలు పైకి ఉబ్బుతాయి.వీటిని సాస్ తో తింటే రుచిగా ఉంటాయి.

దోసె

దోసె

కావలసిన పదార్ధాలు -
పంచమిశ్రమం పిండి - రెండు కప్పులు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
మైదాపిండి - అరకప్పు
మొక్కజొన్న పిండి - అరకప్పు
బియ్యప్పిండి - పావుకప్పు
సన్నగా కోసిన కరివేపాకు - రెండు స్పూన్లు
నూనె - తగినంత
నీళ్ళు - మూడు కప్పులు
తయారుచేయు విధానం -పంచమిశ్రమం పిండిని,మైదాపిండిని,బియ్యప్పిండిని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని నీళ్ళు పోసి దానిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,కరివేపాకు,ఉప్పు వేసి దొసెల పిండిలా కలుపుకోవాలి.ఇలా కలిపిన పిండిని అరగంట సేపు నాననివ్వాలి.తరువాత స్టౌ వెలిగించి పెనం పెట్టి గరిటెతో పిండిని పలుచగా వేసుకుని చుట్టూ నూనె పొసి రెండు వైపూలా కాలాక తీసెయాలి.దీనిని వెరిశనగ చట్నితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

అరటికాయ బజ్జీ

అరటికాయ బజ్జీ

కావలసిన పదార్ధాలు -
అరటికాయలు - రెండు
నూనె - పావుకిలో
శనగపిండి - అరకిలో
వాము - రెండు టీస్పూన్స్
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను చెక్కి చక్రాల్లాంటి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.ఆతరువాత ఒక గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.ఇపుడు పొయ్యిమీద మూకెడలో నూనెపోసి కాగిన తర్వాత అరటికాయలు చక్రాలు శనగపిండిలో వేసి పూర్తిగా మునిగేటట్టు మించి నూనెలో వేసి వేయించాలి బజ్జిలు బాగా వేగినతర్వాత చిల్లుల గరెటతో బజ్జీలను గిన్నెలో వేసుకోవాలి.ఇంకేముంది అరటికాయ బజ్జిలు రడీ.బజ్జిలు బాగా లావుగా పొంగాలంటే పిండిలో కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి.

రిబ్బన్ పకోడి

రిబ్బన్ పకోడి

కావలసిన పదార్ధాలు -
శనగపిండీ - రెండు కిలొలు
లవంగాల పొడి - 25 గ్రాములు
అల్లం వెల్లుల్లి పెస్ట్ - 100 గ్రాములు
పచ్చిమిర్చి ముద్ద - 100 గ్రాములు
వరిపిండి - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
నూనె - రెండు కిలోలు
నీళ్ళు - తగినన్ని
తయారుచేయు విధానం -ముందుగా శనగపిండిని ఉండల్లేకుండా మెత్తగా జల్లించుకొవాలి.తరువాత అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి రసం తీసి తుక్కు లేకుండా వడకట్టుకొవాలి.ఒక గిన్నెలొ శనగపిండి,వరిపిండి,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి రసం,తగినంత ఉప్పు,తగినన్ని నీళ్ళు పొసి గట్టిగా కలుపుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి ఈ పిండిని రిబ్బన్ బిళ్ళను జంతికల గొట్టంలో పెట్టి నూనెలో వేయాలి.అంతే రిబ్బన్ పకోడిలు రడీ.

బ్రెడ్ పకోడి

బ్రెడ్ పకోడి

కావలసిన పదార్ధాలు -
శనగ పిండి - 2కప్పులు
బ్రెడ్ పొడి -1కప్పు
బియ్యం పిండి - అరకప్పు
కొత్తిమిర తురుము - అరకప్పు
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 2
కారం - 1టీస్పూన్
ఉప్పు - తగినంత
జీలకర్ర - అరటీస్పూన్
బేకింగ్ సోడా - చిటికెడు
నూనె - తగినంత.
తయారుచేయు విధానం -ఒక పెద్ద పాత్రలో శనగపిండి,బ్రెడ్ పొడి,బియ్యం పిండి,కొత్తిమిర తురుము,వెన్న,పచ్చిమిరపకాయ ముక్కలు,కారం,ఉప్పు,జీలకర్ర,బేకింగ్ సోడా వేసి నీరు చేరుస్తూ జంతికల పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి.చేతిలోకి కొద్దికొద్దిగా పిండి ముద్దని తీసుకుని పకోడిలా నూనెలో దొరగా వేయించుకోవాలి.వేడిగా తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

గారెలు

గారెలు

కావలసిన పదార్ధాలు -
మినపప్పు - అరకిలో
ఉల్లిపాయలు - 1
పచ్చిమిరపకాయలు - 6
అల్లం -రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
కరివేపాలు - రెండు రొబ్బలు
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందు రోజు రాత్రి మినపప్పును నీళ్ళలో నానబెట్టుకోవాలి.మర్నాడు పొద్దున్నే మెత్తగా రుబ్బుకొవాలి.చేతికి ఉండలు వెచ్చేలా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి.ఇందులో జిలకర్ర,పచ్చిమిరపకాయ ముక్కలు,అల్లం,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు ఉప్పు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టి నూనె పొసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి అరిటాకుపై గారెల్లా ఒత్తుకుని నూనెలో వేయాలి.బంగారు రంగు వచ్చే వరకూ వేగనిచ్చి తిసేయాలి.

ఆలూ పకోడి

ఆలూ పకోడి

కావలసిన పదార్ధాలు -
బంగాళదుంపలు - 100 గ్రాములు
శనగపిండి - 100 గ్రాములు
నూనె - పావుకిలో
జీలకర్ర - ఆఫ్ టీస్పూన్
ఉప్పు - తగినంత
కారం - అర టీస్పున్
తయారుచేయు విధానం -ముందుగా బంగాళదుంపలను తోక్కలు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.తరువాత గిన్నెలో శనగపిండి వేసి పిండి కలిసేటట్టు తగినంతనీరుపోసి జీలకర్ర,కారం,ఉప్పు వేసి కలపాలి.ఆ తరువాత పొయ్యిమిద మూకెడపెట్టి నూనెపోసి కాగిన తరువాత బంగాళదుంప ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి.ద్వారగా ఏగిన తరువాత దించెయ్యాలి.నోరూరించే ఆలూ పకోడి రడీ.
Page 1

పచ్చిమిరపకాయ బజ్జీ

పచ్చిమిరపకాయ బజ్జీ

కావలసిన పదార్ధాలు -
లావుపాటి పచ్చిమిరపకాయలు - పావుకిలో
నూనె - పావుకిలో
శనగ పిండి - అరకిలో
వాము - రెండు టీస్పూన్లు
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి,తొక్కలు తీసి ఉండల్లేకుండా చూసుకోవాలి.అందులో పాలు,వెన్న,బ్రెడ్ ముక్క,రవ్వ,ఉప్పు,మిరియాల పొడి వేసి మెత్తగా కలిపి ఉండలు చేసుకోవాలి.ఒక పెద్ద పాత్రను తీసుకుని దానిలో సగందాకా నీరు పోసి కొంచెం ఉప్పు వేసి మరగనిచ్చి ఆలూ మిశ్రమ ఉండల్ని వేయాలి.ఉడికితే ఉండలు పైకి ఉబ్బుతాయి.వీటిని సాస్ తో తింటే రుచిగా ఉంటాయి.

బటర్ పనీర్ మసాలా

బటర్ పనీర్ మసాలా

కావలసిన పదార్ధాలు -
పనీర్ - పావుకిలో
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పెస్ట్ - ఒక టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
జిడిపప్పు పెస్ట్ - మూడు టేబుల్ స్పూన్లు
టోమోటొ - 3
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మాసాల - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
బటర్ - 3 టీ స్పూన్లు
పసుపు - పావు టి స్పూన్
క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమిర - గార్నిష్ కి సరిపడా
తయారుచేయు విధానం -ముందుగా పనీర్ ముక్కలను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి.తరువాత ఒక కప్పు వేడినీటిలో వేసి ఐదు నిమిషాలున్నాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి.తరువాత స్టౌ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో బటర్ వేయ్యాలి.బటర్ వేడెక్కాక ఉల్లిపెస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.తరువాత అల్లం వెల్లుల్లి పెస్ట్ వేసి మరో మూడు నిమిషాలు వేయించి కారం,జిడిపప్పు పెస్ట్ ను కలపాలి.ధనియాల పొడి,గరం మసాలా,టొమోటో గుజ్జు,పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.తరువాత పనిర్ ముక్కలను కలిపి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచాక ఒక కప్పు నీరు పొసి పది నిమిషాలు పాటు ఉంచి దింపేయాలి.చివరగా కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి.దిన్ని ఎందులోనైనా వేసుకుని తినవచ్చు.

బొప్పాయి కూర

బొప్పాయి కూర

కావలసిన పదార్ధాలు -
కందిపప్పు - అరకప్పు
వెల్లుల్లి రెకలు - పది
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయ సైజు
కొత్తిమిర - ఒక కట్ట
కరీవేపాకు - రెండు రెబ్బలు
పంచదార - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత
రసం పొడి కోసం -
ఎండుమిర్చి - మూడు
ధనియాలు,జిలకర్ర - ఒక టీ స్పూన్
కందిపప్పు,మిరియాలు - ఒక టీ స్పూన్
కరివేపాకు - ఒక కప్పు
వీటన్నింటిని నూనె లేకుండా వేయించుకుని మెత్తగా పొడిలా చేసుకొవాలి.
తయారుచేయు విధానం - చింతపండు గుజ్జుకు రెండుకప్పుల నీరు పొసి దానిలో వెల్లుల్లి రేకలు,ఇంగువ,తగినంత ఉప్పు,రసం పొడి పంచదార వేసి మరగనివ్వాలి.దీనికి ఉడికించిన కందిపప్పు చేర్చి మరికొన్ని నీళ్ళు పొసి మరగనివ్వాలి.బాగా మరిగాక నూనె వేడిచేసి ఆవలు,జిలకర్ర తాలింపు వేస్తే సరిపొతుంది.చివరగా కొత్తిమిర చేరిస్తే సరిపొతుంది.

జీలకర్ర చారు

జీలకర్ర చారు

కావలసిన పదార్ధాలు -
కందిపప్పు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు - నాలుగు
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయ సైజు
పసుపు - చిటికెడు
ఎండు కొబ్బరిముక్క - చిన్నది.
బెల్లం - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమిర - ఒక రొబ్బ
తాలింపు కోసం -
నూనె - ఒక చెంచా
ఆవాలు,జిలకర్ర - ఒక చెంచా
తయారుచేయు విధానం -ముందుగా ఒక కప్పు నీటిలో కందిపప్పు,జిలకర్ర,ఎండుమిర్చి,ధనియాల పొడి,ఇంగువ,కొబ్బరి ముక్క నానబెట్టాలి.పదినిమిషాలయ్యాక మెత్తగా రుబ్బాలి.చింత పండు గుజ్జు తీసి రెండు కప్పుల నీరు పొయాలి.దానిలో తగినంత ఉప్పు,పసుపు,బెల్లం ముక్క కలిపి మరగనివ్వాలి.ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న జిలకర్ర మిశ్రమాన్ని కలిపి మరో రెండు కప్పుల నీరు పొయాలి.బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు,ఆవాలు వేయించి చారులో కలపాలి.చివరగా కొత్తిమిర వేయాలి.

BidVertiser