www.online-parttime-jobs

Search This Blog

Monday, 21 January 2013

పాలక్ పరోటా

పాలక్ పరోటా

కావలసిన పదార్ధాలు -
గోధుమపిండి - నాలుగు కప్పులు
సోయాపిండి - పావుకప్పు
పాలకూర - రెండు కట్టలు
పచ్చిమిరపకాయలు - 5
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్
నిమ్మరసం - ఒకటీ స్పూన్
ధనియాలపొడి - అరటీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.ఇప్పుడు గోధుమ పిండి,సోయాపిండి,తరిగిన పాలకూర,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి ముద్ద,నిమ్మరసం,ధనియాలపొడి,గరం మాసాలా ఉప్పు అన్నింటిని వేసి చపాతి పిండిలా కలిపి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి.ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసి పరోటా మాదిరి ఒత్తుకుని పెనంపై కాల్చాలి.రెండు వైపూలా సొయానూనె చెంచా చొప్పున వేస్తే చాలు.వేడి వేడి సొయా పాలక్ పరోటా రడీ.

No comments:

BidVertiser