www.online-parttime-jobs

Search This Blog

Monday, 21 January 2013

జీలకర్ర చారు

జీలకర్ర చారు

కావలసిన పదార్ధాలు -
కందిపప్పు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు - నాలుగు
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయ సైజు
పసుపు - చిటికెడు
ఎండు కొబ్బరిముక్క - చిన్నది.
బెల్లం - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమిర - ఒక రొబ్బ
తాలింపు కోసం -
నూనె - ఒక చెంచా
ఆవాలు,జిలకర్ర - ఒక చెంచా
తయారుచేయు విధానం -ముందుగా ఒక కప్పు నీటిలో కందిపప్పు,జిలకర్ర,ఎండుమిర్చి,ధనియాల పొడి,ఇంగువ,కొబ్బరి ముక్క నానబెట్టాలి.పదినిమిషాలయ్యాక మెత్తగా రుబ్బాలి.చింత పండు గుజ్జు తీసి రెండు కప్పుల నీరు పొయాలి.దానిలో తగినంత ఉప్పు,పసుపు,బెల్లం ముక్క కలిపి మరగనివ్వాలి.ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న జిలకర్ర మిశ్రమాన్ని కలిపి మరో రెండు కప్పుల నీరు పొయాలి.బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు,ఆవాలు వేయించి చారులో కలపాలి.చివరగా కొత్తిమిర వేయాలి.

No comments:

BidVertiser