రిబ్బన్ పకోడి
కావలసిన పదార్ధాలు - శనగపిండీ - రెండు కిలొలు లవంగాల పొడి - 25 గ్రాములు అల్లం వెల్లుల్లి పెస్ట్ - 100 గ్రాములు పచ్చిమిర్చి ముద్ద - 100 గ్రాములు వరిపిండి - 100 గ్రాములు ఉప్పు - తగినంత నూనె - రెండు కిలోలు నీళ్ళు - తగినన్ని |
|
తయారుచేయు విధానం -ముందుగా
శనగపిండిని ఉండల్లేకుండా మెత్తగా జల్లించుకొవాలి.తరువాత
అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి రసం తీసి తుక్కు లేకుండా వడకట్టుకొవాలి.ఒక
గిన్నెలొ శనగపిండి,వరిపిండి,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి రసం,తగినంత
ఉప్పు,తగినన్ని నీళ్ళు పొసి గట్టిగా కలుపుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి
మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి ఈ పిండిని రిబ్బన్ బిళ్ళను జంతికల గొట్టంలో
పెట్టి నూనెలో వేయాలి.అంతే రిబ్బన్ పకోడిలు రడీ.
|
No comments:
Post a Comment