ఉసిరి కూర
కావలసిన పదార్ధాలు - పెద్ద ఉసిరికాయలు - 10 టమోటాలు - 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్స్ పసుపు,కారం,ఉప్పు - తగినంత కరివేపాకు - రెండు రొబ్బలు ధనియాల పొడి - 1టీస్పూన్ పంచదార - 2టీస్పూన్స్ జీలకర్ర,ఆవాలు - 1 టీస్పూన్ మెంతులు - పావుటీస్పూన్ ఇంగువ - చిటికెడు |
|
తయారుచేయు విధానం -
ముందుగా ఉసిరికాయ ముక్కలు,టమోటా ముక్కలను తరిగి పక్కన ఉంచుకోవాలి.తర్వాత
పాత్రలో రెండు కప్పులు నీరు పోసి దానితో ఉప్పు,పంచదార వేసి బాగా
మరిగించాలి.ఆతరువాత తరిగిన ఉసిరి కాయ ముక్కలను ఆ మరిగే నీటిలో వేసి ఐదు
నిమిషాలపాటు ఉడికించి దించి నీరును మొత్తం వడకట్టి పక్కన ఉంచుకోవాలి.తరువాత
మూకెడలో నూనె పోసి కొంచెం సేపు మరిగాక జిలకర్ర,ఆవాలు వేసి చిటపటలాడాక
మెంతులు,కరీవేపాకు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.ఇంకా
కొంచెం వేగిన తర్వాత ఇంగువ,కారం,ధనియాలపోడి,ఉప్పు,టమోటా ముక్కలు వేసి పది
నిమిషాల పాటు ఉడికించాలి.తరువాత ఉడికిన ఉసిరికాయముక్కలు వేసి ఐదునిమిషాలు
తర్వాత దించివేయాలి దించెటపుడు సువాసన కోసం కోత్తిమీర వేయ్యాలి.
|
No comments:
Post a Comment