www.online-parttime-jobs

Search This Blog

Monday, 21 January 2013

నిమ్మకాయ చారు

నిమ్మకాయ చారు

కావలసిన పదార్ధాలు -
ఉడకపెట్టిన పెసరపప్పు - పావుకప్పు
నిమ్మకాయలు - రెండు
నీళ్ళు - నాలుగు కప్పులు
ఉల్లిపాయ - ఒకటి
టమోటో - ఓకటి
పచ్చిమిరపకాయలు - 3
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - అర టీ స్పూన్
మెంతులు - చిటికెడు
కరివేపాకు - రెండు రెబ్బలు
జీలకర్ర,ఆవాలు - ఒక టీ స్పూన్
కోట్టిమిర - గార్నిష్ కి సరిపడా
ఎండుమిరపకాయలు - 2
తయారుచేయు విధానం - ఒక పాత్రలో ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళలో బాగా కలిపి ఉప్పు,పసుపు,కొంత కరివేపాకు వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి.ఇప్పుడు మరొక పాత్రలో నూనె వేసి కాగాక జీలకర్ర,ఆవాలు వేసి చిటపటలాడాక మెంతులు,కరివేపాకు వేసి అర నిమిషం పాటు వేపుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించుకూన్నాక టమోటో ముక్కల్ని వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు నీటిని పోపులో వేసి 5 నిమిషాలు ఉడకబెట్టి నిమ్మరసం వేసి కలియబెట్టి దింపేయాలి.చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొవాలి.అంతే నోరూరించే నిమ్మకాయ చారు రడీ.

No comments:

BidVertiser