బూడిదగుమ్మడి కాయ కూర
కావలసిన పదార్ధాలు - బూడిద గుమ్మడి కాయ ముక్క - చిన్నది పచ్చిమిర్చి - నాలుగు ధనియాల పొడి - ఒక టీ స్పూన్ కరివేపాకు రెబ్బలు - 3 మెంతిపొడి - చిటికెడు పొడికోసం - శనగపప్పు,కందిపప్పు అరకప్పు చొప్పున తీసుకుని వీటిని దొరగా వేయించి పొడి చేయాలి. తాలింపు కోసం - ఆవాలు,జిలకర్ర - ఒక టీ స్పూన్ ఎండుమిర్చి - రెండు ఉప్పు - తగినంత ఇంగువ - చిటికెడు కారం - ఒక టీ స్పూన్ నూనె - రెండు టేబుల్ స్పూన్లు |
|
తయారుచేయు విధానం -బాణలిలో
నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర,ఇంగువ,ఎండుమిర్చి వేసి వేయించాలి.తాలింపు
చిటపటలాడాక బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి తరువాత
ఉప్పు,కారం,పసుపు,ధనియాల పొడి వేసి కొన్ని నీళ్ళు పొయాలి.వీటన్నింటిని మరో
పాత్రలో వేసి కుక్కర్ లో ఉడికించాలి.తరువాత మళ్ళి స్టౌ పై పెట్టి ముందుగా
సిద్దం చేసుకున్న పొడిని చల్లాలి.తరువాత కొత్తిమిరతో అలంకరిస్తే
సరి.అన్నంతో తినవచ్చు.
|
No comments:
Post a Comment