www.online-parttime-jobs

Search This Blog

Monday 21 January 2013

బటర్ పనీర్ మసాలా

బటర్ పనీర్ మసాలా

కావలసిన పదార్ధాలు -
పనీర్ - పావుకిలో
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పెస్ట్ - ఒక టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
జిడిపప్పు పెస్ట్ - మూడు టేబుల్ స్పూన్లు
టోమోటొ - 3
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మాసాల - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
బటర్ - 3 టీ స్పూన్లు
పసుపు - పావు టి స్పూన్
క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమిర - గార్నిష్ కి సరిపడా
తయారుచేయు విధానం -ముందుగా పనీర్ ముక్కలను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి.తరువాత ఒక కప్పు వేడినీటిలో వేసి ఐదు నిమిషాలున్నాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి.తరువాత స్టౌ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో బటర్ వేయ్యాలి.బటర్ వేడెక్కాక ఉల్లిపెస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.తరువాత అల్లం వెల్లుల్లి పెస్ట్ వేసి మరో మూడు నిమిషాలు వేయించి కారం,జిడిపప్పు పెస్ట్ ను కలపాలి.ధనియాల పొడి,గరం మసాలా,టొమోటో గుజ్జు,పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.తరువాత పనిర్ ముక్కలను కలిపి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచాక ఒక కప్పు నీరు పొసి పది నిమిషాలు పాటు ఉంచి దింపేయాలి.చివరగా కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి.దిన్ని ఎందులోనైనా వేసుకుని తినవచ్చు.

No comments:

BidVertiser